అమరావతి, ఈవార్తలు న్యూస్: అధికారం చేపట్టాలని టీడీపీ-జనసేన-బీజేపీ జట్టు.. మరోసారి అధికారంలోకి రావాలని వైసీపీ (వైఎస్ఆర్సీపీ) పంతం.. షర్మిల కాంగ్రెస్ ప్రభావం.. కలిసిరాని కమ్యూనిస్టులు.. ఇలా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. ఈసారి జగన్ను ఇంటికి పంపించడం గ్యారెంటీ అంటూ చంద్రబాబు, పవన్ కల్యాణ్ కుండబద్ధలు కొడుతున్న వేళ.. మరోసారి ఫ్యాన్ గాలికి సైకిల్ విరిగిపోవటం, గ్లాస్ పగిలిపోవటం గ్యారెంటీ అంటున్నారు జగన్. వీళ్ల వ్యాఖ్యలు ఎలా ఉన్నా, ప్రజలు ఎవరికి అధికారం కట్టబెడతారన్నది ఇంపార్టెంట్.
అందుకే.. ప్రజల నాడీ పట్టాలని-సీప్యాక్ రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేపట్టింది. ఈ సర్వేలో టీడీపీ-జనసేన-జేపీ కూటమిని వైఎస్ జగన్ వ్యతిరేకి వైసీపీ దీటుగా ఎదుర్కొంటుందని తేలింది. మళ్లీ వైసీపీ అధికారం చేపట్టబోతోందని ఆ సర్వే స్పష్టం చేసింది. టీడీపీ రెండో స్థానానికే పరిమితం అవుతుందని.. కాంగ్రెస్, బీజేపీ, జనసేన గెలిచే పరిస్థితులే లేవని. వైసీపీ 121 సీట్లతో రెండోసారి అధికారాన్ని చేపడుతుందని, టీడీపీ 52 సీట్లు, కాంగ్రెస్ ఒక సీటు, ఇతరులు ఒక సీటు గెలుచుకుంటారని.
సీ-ప్యాక్ సర్వే ప్రకారం ఫలితాలు ఇలా..
వైసీపీ – 121
టీడీపీ – 52
కాంగ్రెస్ – 1
ఇతరులు – 1
2019 ఎన్నికల్లో ఇలా..
వైసీపీ – 151
టీడీపీ – 23
జనసేన – 1