విక్టరీ వెంకటేష్(Venkatesth)వన్ మాన్ షో ‘సంక్రాంతికి వస్తున్నాం’ (సంక్రాంతికి వస్తున్నాం)మూవీ ఈ నెల 14న వరల్డ్ వైడ్ గా విడుదలైన విషయం తెలిసిందే.సంక్రాంతి పండుగనే టార్గెట్ చేసుకుని చిత్రీకరించిన ఈ చిత్రం ఏరియాల్లో కూడా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.
ఇక ఈ మూవీ కేవలం మూడు రోజులకే 106 కోట్ల గ్రాస్ ని రాబట్టింది.ఈ మేరకు చిత్ర యూనిట్ ‘ది ఓజి సంక్రాంతి అంటూ ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేసి తమ సంతోషాన్ని వ్యక్తం చేసింది.కేవలం రిలీజైన మూడు రోజులకే 100 కోట్ల క్లబ్ లో చేరిన రోజుల్లో తెలుగు సినిమా చరిత్రలో ‘సంక్రాంతికి వస్తున్నాం. ‘ సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమనే మాటలు ట్రేడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.
దిల్ రాజు(దిల్ రాజు)బ్యానర్ లో నిర్మాణం జరుపుకున్న ఈ మూవీలో వెంకటేష్ తో పాటు హీరోయిన్లుగా చేసిన ఐశ్వర్యరాజేష్(ఐశ్వర్య రాజేష్)మీనాక్షి చౌదరి(మీనాక్షి చౌదరి)నటనకి ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఫిదా అవుతున్నాడు.ముఖ్యంగా ఎంటర్ టైన్ మెంట్ ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు.అనిల్ రావిపూడి(అనిల్ రావిపూడి) దర్శకత్వంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రదర్శనగా భీమ్స్ సంగీతాన్ని అందించడం జరిగింది.సాయికుమార్, ఉపేంద్ర లిమాయే,తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.