భారత ఉపఖండంలో శ్రీలంక ఆర్థిక సంక్షోభాన్ని మరువక ముందే మరొక దేశం పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొని విలవిలలాడుతున్నట్లు కనిపిస్తోంది రోజురోజుకీ అడుగంటిపోతున్న విదేశీ మారకద్రవ్య నిల్వలు, వేగంగా పతనమవుతున్న పాకిస్థాన్ రూపాయి విలువ, తీవ్ర ద్రవ్యోల్బణంతో ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, భారీగా పెరిగిన విదేశీ రుణ భారం కారణంగా… పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభం దిశగా పయనిస్తోంది. గత ఏడాది 16.6 బిలియన్ డాలర్లుగా ఉన్న విదేశీ మారక ద్రవ్య నిలువలు ప్రస్తుతం 5.6 బిలియన్ డాలర్లు చేరుకొని మూడు వారాల పాటు సరిపోయే స్థాయి విదేశీ మారకద్రవ్య నిల్వలు పడిపోయాయి. దీనితో గ్యాస్, పెట్రోలియం ఇంధనం వంటి నూనెలు వంటి వస్తువులను దిగుమతి చేసుకోడానికి పాకిస్థాన్‌కు తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ద్రవ్యోల్బణం 42 ఉత్పత్తి చేరుకోవడంతో దేశంలో వంట నూనెలు గోధుమపిండి నెయ్యి లాంటి నిత్యావసర వస్తువుల ధరలు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి వంట నూనెలను అత్యవసర వస్తువుల జాబితా నుండి తొలగించారు. 15 కిలోల గోధుమపిండి బ్యాగ్ ధర రూ. 2050లకు చేరుకుంది. అలాగే కిలో ఉల్లిపాయల ధర 2022 రూపాయలకు చేరుకుంది. ప్రభుత్వం వివిధ వస్తువుల పైన ఇచ్చేటటువంటి సబ్సిడీలు తొలగించడం వలన వినియోగ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి సబ్సిడీపై ప్రభుత్వం ఇచ్చే గోధుమపిండి కోసం ప్రజలు పడిగాపులు కాయడమే కాదు, అక్కడక్కడా తొక్కిసలాటలు కూడా జరుగుతున్నాయి. రష్యా నుండి నాలుగు లక్షల 50 వేల టన్నుల గోధుమలను దిగుమతి చేసుకోవడం వలన ఆహార సంక్షోభాన్ని మరింత పెంచుతుందని పాకిస్థాన్‌కు హెచ్చరికలు వస్తున్నాయి. కానీ రాబోయే రంజాన్ మాసం నాటికి ఆహార కొరత పాకిస్థాన్‌లో మరింత తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
డాలర్‌తో పాకిస్తాన్ రూపాయి మారకం విలువ రూ. 227లుగా రూపాయి విలువ పడిపోవడంతో దిగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంట్లో భాగంగా రాత్రి ఎనిమిదిన్నర గంటలకే మార్కెట్ల మూసివేత పది గంటల రెస్టారెంట్లు ఫంక్షన్ హాల్ల మూసివేత లాంటి చర్యలు చేపట్టిందంటే అక్కడి పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. 2021 నాటికి పాకిస్తాన్ అప్పులు 29 లక్షల 51 వేల కోట్ల రూపాయలకి చేరుకోవడంతో అంతర్జాతీయ ద్రవ్య సంస్థల నుండి, మిత్ర దేశాల నుండి కొత్త అప్పులు పుట్టని స్థితిలోకి పాకిస్తాన్ దిగజారిపోయింది. ఇప్పటికే అంతర్జాతీయ ద్రవ్యనిధి లాంటి ద్రవ్య సంస్థలు అప్పు ఇవ్వటానికి నిరాకరిస్తున్నాయి. దీనితో పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం పొంచి ఉంది.పాకిస్తాన్లో ఇంతవరకు ఏర్పడిన పౌర ప్రభుత్వాల సైన్యం చెప్పు చేతుల్లో ఉంది, వారి దయాదాక్షిణ్యాల పైన పనిచేయటం వలన రాజకీయ అస్థిరతతో ఆ దేశం భారీ మూల్యాన్ని చెల్లించుకుంటున్నట్లుగా ఉంది. పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుంటే, ప్రధానమంత్రి పదవిని కాపాడుకోవడానికి మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, అధికారంలోకి రావడానికి ప్రస్తుత ప్రధాని షాబాజ్ షరీఫ్ రాజకీయాలలో మునిగి తేలటం కూడా పాకిస్థాన్ ప్రస్తుత స్థితికి కారణంగానే భావించాలి.పాకిస్తాన్ పాలకులు బెనజీర్ భుట్టో, ఆసిఫ్ అలీ జార్దారి, నవాజ్ ఖాన్ ఇమ్రాన్… అందరి పైన అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇటీవల వరకు ఆ దేశ సైన్యాధ్యక్షుడిగా పనిచేసిన జనరల్ బాజ్వాపై కూడా అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి అంటే పాకిస్థాన్‌లో అవినీతి ఏ స్థాయిలో వేళ్ళూనుకుపోయిందో అర్థమవుతుంది.
పాలకుల అవినీతి దేశ ఆర్థిక వ్యవస్థని పెద్ద ఎత్తున దెబ్బతీసింది. పాలకులు పాకిస్తాన్‌ని ఉగ్రవాద స్థావరంగా మార్చడం, ఆఫ్గన్‌లో పరిణామాలు ప్రతికూలంగా మారడం, కాశ్మీర్లో ఉగ్రవాద ప్రేరిత కార్యకలాపాలకు ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సహాయం చేయడం, భారత్‌లో భవిష్యత్తులో ప్రమాదం పొంచి ఉంది అనే అపోహలతో రక్షణ అవసరం, బడ్జెట్లో ఖర్చు చేయడం, చైనా నుండి పెద్ద ఎత్తున అప్పులు తీసుకోవడం వంటి కారణాలు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉన్నాయి. కూరుకుపోవడానికి దారితీశాయి.ఇప్పటికైనా పాకిస్తాన్ పాలకులు భారత్‌పై తమ గుడ్డి వ్యతిరేకతను పక్కనపెట్టి వ్యాపార, రక్షణ, శాంతి, ఆర్థికపరమైన దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకుంటే అంతర్జాతీయంగా కలిసి వస్తుంది. ఉగ్రవాద కార్యకలాపాలకు స్వస్తి చెప్పి ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో స్నేహ సంబంధాలు ఆర్థిక సంబంధాలు వ్యాపార సంబంధాలు ఏర్పడకపోతే పాకిస్తాన్ మరింత తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉంది. పాకిస్తాన్ ప్రస్తుత సంక్షోభం నుండి బయటపడటానికి 30 బిలియన్ డాలర్లు అవసరమయ్యే ఆర్థిక సంవత్సరంలో పాకిస్తాన్ వృద్ధిరేటు కేవలం రెండు పరిమితమయ్యే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంకు అంచనా. కాబట్టి ఆర్థిక సంక్షోభం మరింత ముదరకముందే పాక్ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. పాకిస్తాన్ రాజకీయ ఆర్థిక పరిణామాలు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ భారత్‌పై కూడా పడే అవకాశం ఉంది. దాయాది పాకిస్థాన్ ఈ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడాలని ఆశిద్దాం.