ఎలాన్ మాస్క్ మరోసారి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అయ్యాడు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం, ట్విట్టర్ కొత్త యజమాని ఎలన్ మాస్క్ నికర విలువ ప్రస్తుతం దాదాపు 187 బిలియన్ డాలర్లు. బ్లూమ్‌బెర్గ్ ర్యాంకింగ్‌లో, మాస్క్ ప్రపంచంలో అత్యంత సంపన్న వ్యక్తిగా గుర్తింపు పొందారు. తాజాగా ర్యాంకింగ్ విషయానికొస్తే, ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో ఫ్రాన్స్‌కు చెందిన బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ను వెనక్కి నెట్టి ఎలాన్ మాస్క్ అగ్రస్థానంలో ఉన్నాడు.
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ర్యాంకింగ్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ యజమాని ముఖేష్ అంబానీ 10వ స్థానంలో, అదానీ గ్రూప్ యజమాని గౌతమ్ అదానీ 30వ స్థానంలో ఉన్నారు. తాజా ర్యాంకింగ్ ప్రకారం ముఖేష్ అంబానీ భారతదేశంలోనే అత్యంత ధనవంతుడుగా నిలిచారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం, అంబానీ నికర విలువ దాదాపు 81.1 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ ర్యాంకింగ్‌లో గౌతమ్ అదానీ 32వ స్థానంలో ఉన్నారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం, ప్రస్తుతం అదానీ గ్రూప్ యజమాని మొత్తం నికర విలువ దాదాపు 37.7 బిలియన్లుగా నమోదు అయ్యింది.