ట్విట్టర్ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే.. దానికి పోటీగా మరో షోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘బ్లూ స్కై’ని తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బ్లూ స్కై యాప్ ను ఇప్పటికే యాపిల్ ఐవోఎస్ పై పరీక్షిస్తున్నారు. యాపిల్ స్టోర్ యాప్ లో బ్లూ స్కైని గుర్తించొచ్చు. ట్విట్టర్ అభివృద్ధిలో తన వాటాలను టెస్లా అధినేత ఎలాన్ మాస్క్ కు విక్రయించేసిన జాక్ డోర్సే అప్పటి నుంచి బ్లూ స్కైపై దృష్టి పెట్టారు. ట్వట్టర్ మాదిరే దీనికీ బ్లూ రంగు అద్దారు జాక్ డోర్సే.
ఇది కూడా మైక్రో బ్లాగింగ్ ప్లాట్ ఫామ్ కావడం గమనించాలి. యాప్ స్టోర్ లో ఉండే, ఇన్విటేషన్ ఉన్నవారే దీన్ని స్టాల్ చేసుకుని వాడుకోవడానికి వీలుంటుంది. బీటా టెస్ట్ తర్వాత బ్లూ స్కై అందరికీ అందుబాటులోకి రానుంది. డీసెంట్రలైజ్డ్ సోషల్ మీడియా ప్రోటోకాల్ గా దీన్ని డిజైన్ చేశారు. ఫిబ్రవరి 17న యాప్ స్టోర్లోకి వచ్చిన బ్లూస్కై యాప్ను 2,000 మంది ఇన్స్టాల్ చేసి పరీక్షిస్తున్నట్టు సమాచారం. యూజర్ ఇంటర్ ఫేస్ ట్విట్టర్ మాదిరే ఉండనుంది.