వాషింగ్టన్: అమెరికా రాజధాని వాషింగ్టన్ లోని భారత రాయబార కార్యాలయం ఎదుట ఆదివారం నాడు ధర్నా జరిపిన ఖలిస్తాన్ మద్దతుదారులు కొందరు పీటీఐ విలేఖరి లలిత్ కె ఝాపై దాడికి పాల్పడ్డారు. ఖలిస్తాన్ మద్దతుదారులు ఝాను దుర్భాషలాడుతూ ఆయన మీద దాడికి దిగారు. అక్కడ ఉన్న అమెరికన్ సీక్రెట్ పోలీసులు, స్థానిక భద్రతా సిబ్బంది ఆయనను కాపాడారు.
పీటీ ఐ విలేకరిపై జరిగిన ఈ దాడిని భారత రాయబార కార్యాలయం తీవ్రంగా ఖండించింది. విలేఖరి ఫోటోలు తీస్తుండగా కెమెరాకు అడ్డు రావడమే కాకుండా ఖలిస్తాన్ జెండాతో మొహం మీద దాడి చేశారు. ‘నువ్వు రాయబోతున్నావు’ అంటూ నిలదీస్తూ మీది మీదికి రావడంతో ఝా పోలీసులకు ఫిర్యాదు చేశారు.