సూడాన్‌లో చిక్కుకున్న తెలంగాణవారిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. సూడాన్ నుంచి భారత్‌కు తరలిస్తున్నవారిలో తెలంగాణవాసులు ఉంటే టీఎస్ ప్రభుత్వం సాయం చేస్తుంది. ఢిల్లీలోని తెలంగాణ భవనాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. తెలంగాణవాసుల వివరాల కోసం విదేశాంగ శాఖతో సమన్వయం చేసుకుంటున్నారు. ఈ విషయం తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ చెప్పారు. ఈ రోజు సూడాన్ నుంచి వచ్చేవారిలో తెలంగాణకు చెందిన నలుగురు వ్యక్తులు ఉన్నారు. ఢిల్లీ వచ్చిన హైదరాబాద్‌వారిని పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.