ముద్రణ న్యూస్ డెస్క్: అమెరికాలోని న్యూయార్క్, న్యూజెర్సీ, మేరీ ల్యాండ్, ఫిలి ఫిలిప్యా ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం 10.23 గంటల ప్రాంతంలో (భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 7:45 గంటలకు) భూకంపం సంభవించింది. న్యూ జెర్సీ లోని వైట్ హౌస్ స్టేషన్ కు ఉత్తరాన 7 కిలో మీటర్ల దూరంలో ప్రధాన కేంద్రంగా సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.8 గా నమోదైంది. దీనితో భయభ్రాంతులకు గురైన ప్రజలు షాపింగ్ మాల్స్ నుంచి, ఆఫీసుల నుంచి, ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు.