- న్యూయార్క్ లో చిత్రకళ ప్రదర్శన
- కనువిందు చేస్తోన్న ప్రముఖ ఆర్టిస్టుల చిత్రాలు
- ఏలే లక్ష్మణ్, ఏలే ప్రియాంక
న్యూయార్క్, ముద్రణ: తెలంగాణ చిత్రకళ ఎల్లలు దాటింది. ఈ నెల 4నుంచి 7వరకు న్యూయార్క్‌లో అంతర్జాతీయ చిత్రకళా పోటీల్లో రాష్ట్రానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు ఏలే లక్ష్మణ్, ఆయన కూతురు ప్రియాంక వేసిన చిత్రాలను ఆకట్టుకుంటున్నాయి. ఆ పోటీలో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి వచ్చిన, చూసేందుకు వచ్చిన వారందరూ తండ్రి, తనయ వేసిన బొమ్మలను చూసి ఔరా అంటున్నారు. విశేషంగా ఆకట్టుకుంటోన్న ఆయా చిత్రాలను చూసి కితాబిస్తున్నారు.