- కోర్టులో కేసు వేసిన 200 మంది మహిళలు
బోస్టన్: అమెరికాలోని బోస్టన్‌లో ఒక ప్రైవేటు వైద్యుడు అనవసరమైన వైద్య పరీక్షల పేరుతో కోర్టు వేధింపులకు గురిచేసేవాడని 200 మంది మహిళలతో పాటు పలువురు పురుషుల కేసు ఫైల్ చేశారు. గత ఏడాది జులైలో ఆయన విధుల నుంచి నిష్క్రమించేదాకా బ్రిగ్ హామ్, ఉమెన్స్ ఆసుపత్రిలో రుమటాలజిస్ట్ గా పనిచేసిన డాక్టర్ డెరిక్ టాడ్ అనవసరమైన పెల్విక్ ఫ్లోర్ థెరపీ, రొమ్ము పరీక్షలు, పురుషులకు వృషణ పరీక్షలు చేసిన కోర్టులో ఫైల్ చేసిన ఆట్‌లో పేర్కొన్నారు. 2010 నుంచి కూడా టాడ్ ఈ విధంగా చేయడం మొదలుపెట్టాడని అందులో పేర్కొన్నారు. మసాచుసెట్స్‌లోని సఫోల్క్ సుపీరియర్ కోర్టులో ఈ వ్యాజ్యం దాఖలైంది. ఆస్పత్రుల యాజమాన్యాలు ఇది తెలిసి కూడా నిరోధించడంలో విఫలమయ్యాయని అందులో పేర్కొన్నారు. ఏప్రిల్ 2023 నుంచి టాడ్ పై మహిళల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు మొదలయ్యాయి. ఆ తర్వాత జులైలో బ్రిగ్ హామ్ ఉమెన్స్ ఆసుపత్రి అతణ్ణి విధుల నుంచి తొలగించింది.