ముద్ర, తెలంగాణ బ్యూరో: ఎక్స్ (గతంలో ట్విటర్)లో ఇక ఏమైనా పోస్టు చేయాలంటే ఫీజు చెల్లించాల్సిందే. కొత్త యూజర్లు చేసే పోస్టుకు స్వల్ప మొత్తంలో ఫీజు చెల్లించాల్సిన అవసరం రావచ్చునని ఎక్స్‌ఓనర్ ఎలాన్ మాస్క్ అన్నారు. బాట్స్ సమస్యను నివారించాలంటే.. ఇలా చేయకతప్పదని, ఎక్స్ డైలీ న్యూస్ లో సోమవారం వచ్చిన ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
అందరూ ఈ ఫీజు చెల్లించాల్సిందేనా అని ప్రశ్నించినపుడు, అకౌంట్ క్రియేట్ చేసిన మొదట్లో కచ్చితంగా ఇవ్వాల్సిందేనని.. మూడు నెలల తర్వాత చెల్లించకపోయినా పోస్ట్ చేయొచ్చని చెప్పారు. అయితే ఈ విధానం ఎప్పటి నుంచి అమలులోకి తీసుకొస్తారన్నది మాత్రం ఆయన చెప్పలేదు.
న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్‌లో కొత్త వినియోగం నుంచి 2023 అక్టోబర్ నుంచి సంవత్సరానికి ఒక డాలర్ చొప్పున వసూలు చేస్తున్నారు. ఈ దేశాలకు చెందిన కొత్త యూజర్లు ఎక్స్‌లో పోస్ట్‌ను చూడగలరు. కానీ వీరికి రిప్లై, రీపోస్ట్, కొత్త పోస్ట్ రాయడం వంటి ఆప్షన్లు ఉండవు. ఈ విధానాన్నే ఇప్పుడు ఇతర దేశాలకూ విస్తరించిన యోచనలో ఎలాన్ మాస్క్ ఉన్నట్టు ఉంది.