- గ్రీన్ కో కంపెనీకి రేసింగ్ బాధ్యతలు
- ఫలితంగా బీఆర్ఎస్కు రూ. 41 కోట్ల పార్టీ ఫండ్
- సంచలన విషయాలు బయటపెట్టిన ప్రభుత్వం
ముద్ర, తెలంగాణ బ్యూరో : ఇప్పటిదాకా ఫార్ములా ఈ కారు రేసులో పాత ప్రభుత్వానికి కోట్లలో లబ్ధి చేకూరింది. ఈ రేసు కేసులో కీలక విషయాలను ప్రభుత్వం బయట పెట్టింది. ఫార్ములా రేసుకు ప్రభుత్వం చెల్లించిన నిధులకు సంస్థ తిరిగి పార్టీ ఫండ్ రూపంలో భారీగానే అప్పటి అధికార బీఆర్‌ఎస్ పార్టీకి ముట్టజెప్పింది. బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల బాండ్ల రూపంలో రూ.49 కోట్లను గ్రీన్ కో కంపెనీ చెల్లించిందని.. గ్రీన్ కో, దాని అనుబంధ సంస్థలు 41 సార్లు బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల బాండ్ల రూపంలో చందాలు ఇచ్చిన ప్రభుత్వం విడుదల చేసింది. రేసుకు సంబంధించిన చర్చలు మొదలయినప్పటి నుండి ఎన్నికల బ్యాండ్‌లను గ్రీన్ కో సంస్థ కొనుగోలు చేసింది. దీనితో ఫార్ములా-ఈ రేస్ కేసులో అసలు ట్విస్ట్ బయటకు వచ్చింది.
ఇదికో.. మీకింత లబ్ధి
ఫార్ములా ఈ కారు రేసింగ్ కేసుకు సంబంధించి సంచలన విషయాలు తెలంగాణ సర్కార్. ఇందులో క్విడ్ ప్రోకో జరిగినట్టుగా ప్రభుత్వం తేల్చింది. బీఆర్ఎస్‌కు రూ.41 కోట్లను బాండ్ల రూపంలో గ్రీన్ కో సంస్థ ముట్టచెప్పినట్టు ప్రభుత్వం. గ్రీన్ కో కంపెనీ ద్వారా బీఆర్ఎస్ పార్టీకి కోట్ల రూపాయల లబ్ధి చేకూరేలా వివరాలను బయట పెట్టింది. బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల బాండ్ల రూపంలో రూ.49 కోట్లను గ్రీన్ కో కంపెనీ చెల్లించిందని.. గ్రీన్ కో, దాని అనుబంధ సంస్థలు 41 సార్లు బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల బాండ్ల రూపంలో చందాలు ఇచ్చినట్లు చెబుతున్నారు. రేసుకు సంబంధించిన చర్చలు మొదలయినప్పటి నుండి ఎన్నికల బ్యాండ్‌లను గ్రీన్ కో సంస్థ కొనుగోలు చేసినట్లు సమాచారం. 2022, 8 ఏప్రిల్ నుంచి అక్టోబర్ 10 మధ్య బ్యాండ్‌లను కొనుగోలు చేసింది.
ప్రతి సారి రూ. కోటి విలువ చేసే బ్యాండ్లు గ్రీన్ కో కంపెనీ కొనుగోలు చేశారు. గ్రీన్ కో సంస్థ నుండి కాకుండా అనుబంధ సంస్థల నుండి ఈ విరాళాలు బీఆర్ఎస్ ఖాతాలో జమ అయ్యాయి. పలు విడుతల్లో మొత్తం రూ. 49 కోట్లను ఎన్నికల బాండ్ల రూపంలో బీఆర్ఎస్ కు గ్రీన్ కో సంస్థ చెల్లింపులు చేసింది. కాగా.. ఈ ఫార్ములా ఈ రేసుకు గత ప్రభుత్వానికి, బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని కేటీఆర్, ఆ పార్టీ నేతలు పదే పదే చెబుతున్న విషయం తెలిసిందే. తాజాగా బయటకు వచ్చిన విషయంతో ఫార్ములా ఈ రేస్ వల్ల బీఆర్ఎస్ పార్టీ లబ్ది పొందినట్లు తేటతెల్లమైంది.
మాకే కాదు.. మీకు కూడా గ్రీన్ కో బాండ్లు : కేటీఆర్
గ్రీన్‌కో విరాళాల అంశం రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ పెంచాయి. అధికార పార్టీ బీఆర్‌ఎస్‌పై విమర్శలకు దిగింది. ఇదే సమయంలో మాజీ మంత్రి కేటీఆర్ ఈ వ్యాఖ్యలపై కౌంటర్ ఎటాక్ చేశారు. గ్రీన్‌కో సంస్థ ద్వారా బీఆర్ఎస్ పార్టీకి రూ. కోట్ల లబ్ధి చేకూరినట్ట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. గ్రీన్‌కో 2022లో ఎన్నికల బ్యాండ్‌లు ఇచ్చామని, 2023లో ఫార్ములా ఈ రేసు జరిగిందని. కాంగ్రెస్, బీజేపీకి కూడా గ్రీన్‌కో బాండ్లు ఇచ్చిందని, ఫార్ములా ఈ రేసు కరణంగా గ్రీన్ కో నష్టపోయిందని. అందుకే మరుసటి ఏడాది స్పాన్‌సర్‌షిఫ్ నుంచి తప్పుకుందని, అది క్విడ్ ప్రోకో ఎలా అవుతుందని కేటీఆర్ ప్రశ్నించారు. ఇది రేవంత్ రెడ్డి టీం చేస్తున్న దుష్ప్రచారం అని, పార్లమెంట్ ఆమోదించిన ఎన్నికల బాండ్లు అవినీతి ఎలా అవుతుందని, దేశ వ్యాప్తంగా అన్ని పార్టీలకు వచ్చిన బాండ్లపై చర్చకు సిద్ధం అని కేటీఆర్ స్పష్టం చేశారు.
The post క్విడ్ ప్రో క్రో ‘ఫార్ములా’ .. కారు రేసింగ్‌లో మీకింత.. మాకింత appeared first on Mudra News.