ముద్ర ప్రతినిధి, నిర్మల్: క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రాణాంతకంగా మారటం సహజం. ఇలా కుటుంబ కలహాలతో ఆత్మహత్య యత్నం చేసిన మహిళను పోలీసులు కాపాడారు. ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో ఒక వివాహిత కుటుంబం కలహాలతో క్షణికావేశంలో ఆత్మహత్యకు నిర్ణయించుకుంది. స్థానిక కంచరోని చెరువులోకి దూకి ఆత్మహత్య యత్నానికి వెడుతున్నప్పుడు అటుగా వెళ్తున్న కొందరు పోలీసులకు చేరారు.
పట్టణ బ్లూ కోల్ట్స్ సిబ్బంది కానిస్టేబుళ్లు ఎన్. గణేష్, తిలక్ లు సంఘటన స్థలానికి చేరుకున్నారు. వివాహితను ఆత్మహత్య చేసుకోకుండా నివారించగలిగారు. ఆమెను వారి కుటుంబ సభ్యులకు అప్పగించి ఆమె కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ ఉదంతంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందిని నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జి. జానకి షర్మిల ప్రశంసించారు.
The post మహిళను కాపాడిన పోలీసులు appeared first on Mudra News.