విజయవాడ: అదానీ ఆర్థిక నేరాలపై కమిటీ వేయాలంటూ ఛలో రాజభవన్‌కు ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు. ఈ మేరకు అప్రమత్తమైన పోలీసులు వివిధ జిల్లాల్లో కాంగ్రెస్ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. సోమవారం ఉదయం కాంగ్రెస్ కార్యాలయం నుంచి ర్యాలీగా రాజభవన్‌కు బయలుదేరిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. కార్యాలయం నుంచి బయటకు రాగానే అడ్డుకుని అరెస్ట్ చేశారు. దీంతో కాంగ్రెస్ నాయకులు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అరెస్టు అయిన వారిలో ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు, క్రిస్టఫర్, సుంకర పద్మశ్రీ, మస్తాన్ వలీ, ఇతర నేతలు ఉన్నారు.