బెజవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా దేవినేని అవినాష్ పేరును సీఎం జగన్ దాదాపుగా ఖరారు చేశారు. నియోజకవర్గ సవిూక్ష సమావేశంలో దేవినేని అవినాస్‌ను గెలిపించుకునే బాధ్యత విూత చేతుల్లో పెడుతున్నానంటూ సీఎం చేసిన వ్యాఖ్యలతో వైసీపీలో చర్చ మొదలైంది.తూర్పు నియోజకవర్గంలో ప్రస్తుతం టీడీపీ నుంచి గద్దె రామ్మోహన్ శాసన సభ్యుడిగా పని చేస్తున్నారు. విజయవాడ పశ్చిమ మూడు నియోజకవర్గాల్లో సెంట్రల్, నియోజకవర్గాలు వైసీపీనే గెల్చుకుంది. మరో నియోజకవర్గం తూర్పులో మాత్రం టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన గద్దె రామ్‌మెహన్ విజయం సాధించారు. రాబోయే ఆ ఒక్క నియోజకవర్గాన్ని కూడా వైఎస్‌ఆర్‌సీపీనే దక్కించుకోవాలని జగన్ పార్టీ శ్రేణులకు సీఎం. విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీలో అప్పుడే విభేదాలు మెదలయ్యాయి.
సీఎంతో సమావేశానికి ఇంచార్జ్‌గా ఉన్న దేవినేని జిల్లా అవినాష్‌తో పాటు పార్టీ అధ్యక్షుడు వెలంపల్లి శ్రీనివాస్, విజయవాడ నగర వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న బొప్పన భువకుమార్, అదే నియోజకవర్గానికి చెందిన కాపు కార్పోరేషన్ చైర్మన్ అడపా శేషుతోపాటు మరికొందరు నాయకులు హాజరయ్యారు. నియోజకవర్గంలో అత్యంత కీలకంగా ఉన్నమాజీ శాసన సభ్యుడు యలమంచిలి రవి సమావేశానికి హాజరు కాలేదు. ఆయనకు సమావేశానికి సంబంధించిన సమాచారం కానీ ఆహ్వానం కూడా అందలేదని యలమంచిలి వర్గం చెబుతుంది. నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్‌కు యలమంచిలి రవి కుటుంబానికి మధ్య ఉన్న విభేదాలతోనే యలమంచిలి రవిని దూరం పెట్టారని ప్రచారం జరుగుతుంది. దేవినేని, యలమంచిలి కుటుంబాలు ఒకే సామాజిక వర్గం అయినప్పటికి రాజకీయంగా ఆది నుంచి విభేదాలు ఉన్నాయి.విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గతంలో యలమంచిలి నాగేశ్వరరావు టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తరువాత ఆయన చనిపోవడంతో ఆయన కుమారుడు యలమంచిలి రవి ప్రజారాజ్యం పార్టీ నుంచి విజయవాడ తూర్పులో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో నెహ్రూపై టీడీపీ నుంచి ప్రత్యర్థిగా ఉన్న దేవినేని రాజశేఖర్ విజయం సాధించారు.
యలమంచిలి, దేవినేని కుటుంబాల మధ్య రాజకీయంగా మొదటి నుంచి పోటీ సాగుతోంది. యలమంచిలి రవిపై విజయం సాధించాలని దేవినేని నెహ్రూ చాలా ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. కాలక్రమంలో ఇద్దరు నాయకులు చనిపోయారు. ఇప్పుడు యలమంచిలి, దేవినేని కుటుంబాలకు చెందిన వారసులు ఇరువురు వైసీపీలనే ఉన్నారు. అయితే యలమంచిలి రవి సైలెంట్ పాలిటిక్స్‌లో కొనసాగుతుండగా దేవినేని వారసుడిగా వచ్చిన దేవినేని అవినాష్ వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్‌గా పని చేస్తున్నారు.నియోజకవర్గాల వారిగా సమావేశాలను నిర్వహిస్తున్న సీఎం విజయవాడ తూర్పు నియోజకవర్గ నేతలతో కూడా సమావేశం అయ్యారు. ఈ భేటీలోనే అవినాష్‌ను అభ్యర్థిగా వెల్లడించారు. ఇప్పుడు యలమంచిలి రవి ఏం చేయబోతున్నారనే చర్చ నియోజకవర్గంలోనే కాకుండా జిల్లాలో నడుస్తోంది.