విజయవాడ ,డిసెంబర్ 28:ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఎపియు.డబ్ల్యు.జే.) రాష్ట్ర అధ్యక్ష స్థానానికి జనవరిలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుత అధ్యక్షుడు ఐ.వి.సుబ్బారావు శనివారం తన నామినేషన్ దాఖలు చేశారు. ఆయన తన నామినేషన్ పత్రాల సెట్ను ఎన్నికల అధికారి , ఐజేయూ జాతీయ కార్యదర్శి డి.సోమసుందర్ కు , సహాయ ఎన్నికల అధికారి ఎస్.కె. బాబు కు అందచేశారు.
ఎ.పి.యు.డబ్ల్యూ.జే. ఎన్నికల నియమావళి ప్రకారం రాష్ట్రంలోని మొత్తం జిల్లా శాఖలలో మూడింట రెండు వంతుల జిల్లా శాఖల నుండి అధ్యక్ష అభ్యర్థికి మద్దతుగా ప్రతిపాదనలు రావాల్సి ఉండగా ఐ.వి.సుబ్బారావుకు మద్దతుగా మొత్తం అన్ని జిల్లాల ప్రతిపాదనలు వచ్చాయి.కొన్ని జిల్లాల నుండి ఆయనకు మద్దతుగా రెండు , మూడు ప్రతిపాదనలు కూడా రావడంతో ఐ.వి. సుబ్బా సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు.2025 – 2027 సంవత్సరాలకు గాను రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ డిసెంబర్ 26 న విజయవాడ ప్రెస్ క్లబ్‌లోని రెండు యూనియన్ రాష్ట్రరావు జిల్లాలు , వివిధ జిల్లాలలో ప్రారంభం అయ్యాయి.
శనివారం ఐ.వి.సుబ్బారావు నామినేషన్ కార్యక్రమంలో ఐ.జే.యు. జాతీయ కార్యవర్గ సభ్యులు ఆలపాటి సురేష్ కుమార్, రాష్ట్ర ప్రధానకార్యదర్శి చందు జనార్ధన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కంచల జయరాజ్, కే.మాణిక్యరావు, రాష్ట్ర కోశాధికారి ఈ.వి.శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చావా రవి, వై.వెంకటరావు, పి.భక్తవత్సల రావు, సీహెచ్. రాంబాబు, ఏ.సురేష్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శివ ఏచూరి , చిన్న మధ్య తరహా పత్రికల సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి సి.హెచ్.రమణా రెడ్డి, ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాంబశివరావు , కృష్ణా అర్బన్ శాఖ కార్యదర్శి దారం వెంకటేశ్వరరావు , విజయవాడ ప్రెస్ క్లబ్ కార్యదర్శి డి. నాగరాజు నిర్వహించారు.