కాపుల రిజర్వేషన్ వ్యవహారం
కాపులకు రిజర్వేషన్లు ఇచ్చింది మేమే అని చెప్పుకోలేని స్థితిలో ఉన్నామని టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ తర్వాత పదే పదేచెప్పుకుంటే బీసీల ఓట్లు గల్లంతయ్యే అవకాశం ఉండటంతో టీడీపీ నేతలు సైలెంట్ అవ్వక తప్పని పరిస్థితి నెలకొంది.టీడీపీ ప్రభుత్వ హయాంలో కాపు రిజర్వేషన్లపై క్లారిటీ వచ్చింది. అయితే అవి అమలు చేసే విషయంలో సాంకేతికంగా వచ్చిన అడ్డంకులతో అమలు సాధ్యం కాలేదు. ఇదే సమయంలో ఎన్నికలు రావడంతో కాపు రిజర్వేషన్ల వ్యవహరం తెరమరుగైంది. అయితే ఇటీవల పార్లమెంట్ సాక్షిగా కాపు రిజర్వేషన్లు కరెక్టే అని ప్రకటన రావడంతో ఈ విషయంలో టీడీపీకి చెందిన కొందరు నేతలు మాట్లాడలేకపోతున్నారు. ఆ క్రెడిట్‌ను స్కోర్ చేసుకునేందుకు ప్రయత్నించాలన్నా కూడా వెనుకా ముందు ఆలోచించి చేశారు. ఈ విషయంలో టీడీపీ ఎలాంటి కామెంట్స్ చేసినా.. బీసీ వర్గాలతో దానిపై కామెంట్లు చెప్పాలని వైసీపీ వ్యూహం సిద్ధం చేసుకుందని భావించిన టీడీపీ నేతలు మౌనం వహిస్తున్నారు. రాష్ట్రంలో కాపు రిజర్వేషన్లకు సంబంధించిన వ్యవహరం ఇప్పటిది కాదు. దశాబ్దాలుగా ఈ వ్యవహరంపై రాజకీయం నడుస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సైతం కాపు రిజర్వేషన్ల కోసం పోరాటాలు జరిగాయి. స్వాతంత్య్రానికి ముందు నుంచి రిజర్వేషన్లు కావాలంటూ కాపులు ఆందోళనలు చేశారు. అయితే గత ప్రభుత్వాలు వాటిని అంతగా పట్టించుకోలేదు.
ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సైతం కాపులు పెద్ద ఎత్తు చేసిన పోరాటాలు తరువాత, విభజన అంశం తెరవిూదకు రావటం, తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోవడం జరిగింది. విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లను ప్రకటించింది. దీంతో బీసీ వర్గాలకు టీడీపీపై కినుకు వహించారు. బీసీ వర్గాలకు చెందాల్సిన ఫలాలను కొట్టేసి, టీడీపీ కాపులకు పంచిందని ఆ వర్గం మండిపడింది. అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరాజయం తప్పలేదు. అదే వీక్ పాయింట్ ను పట్టుకున్న తన వంతు ప్రచారం చేయటంతో వైసీపీ బీసీ వర్గాలను తన వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయింది. దాని ఫలితంగానే 2019 అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ మెజార్టీ స్థానాల్లో గెలుపొందింది.అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు అగ్రతాంబూలం ఇచ్చింది.
బీసీలను కేంద్రంగా చేసుకొని రాజకీయం నడుపుతోంది. ఇందులో భాగంగానే జయహో బీసీ సభను భారీగా నిర్వహించారు వైసీపీ. రాష్ట్ర కేబినెట్లో సైతం బీసీ, ఎస్సీ, మైనార్టీలకు ప్రాధాన్య ఇచ్చిన పార్టీ వైసీపీ అని ఈ వర్గాలకు తమ న్యాయం జరుగుతుందని ప్రజల్లోకి వెళ్లాలని ఎమ్మెల్యేలకు సీఎం జగన్ కూడా సూచిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పదవులు పొందిన బీసీ వర్గాలతో వైసీపీ జయహో బీసీ సభ సక్సెస్ కావటంతో ప్రతి నియోజకర్గంలో బీసీ సభలను నిర్వహించేందుకు వైసీపీ సన్నద్ధం అవుతోంది. అయితే ఇదే సమయంలో టీడీపీ సైతం బీసీలను తన వైపునకు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ కావాలనే కాపు వర్గాలకు రిజర్వేషన్లు కేటాయించిన విషయంలో టీడీపీ నేతలు మాట్లాడలేని స్థితిలో ఉన్నారని, అందుకే మౌనం వహించారని చర్చ నడుస్తోంది. ఎన్నికలకు సంబంధించిన హడావుడి ఇదివరకే మొదలుకాగా, బీసీ వర్గం టీడీపీ వైపునకు రావాలంటే, ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలియాలని టీడీపీ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు.