మంగళగిరి: అమరావతి అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో అధికారంలో ఉన్న బీజేపీని వీడి కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలోకి వచ్చారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు. కన్నాకు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం చంద్రబాబు మాట్లాడారు. జగన్ పాలనలో అన్ని వ్యవస్థలూ విధ్వంసానికి కారణమని చెప్పారు. ”రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కూడా ఆనందంగా లేడు. పంటలకు గిట్టుబాటు ధర లభించలేదు. విద్యారంగంలో ఏపీ 19వ స్థానానికి దిగజారింది. రాష్ట్రంలో సంక్షేమం అడ్రస్ లేకుండా పోయింది. మొత్తం మూసివేసే పరిస్థితి వచ్చింది. గ్రామీణ వ్యవస్థ మొత్తం నిర్వీర్యమైంది” అని జగన్ సర్కార్ పై చంద్రబాబు ధ్వజమెత్తారు.