రాజధాని ప్రాంతాన్ని ‘హరిత అమరావతి’గా మార్చాలని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పించారు. ఆ మేరకు రాజధానిని 5 గ్రామాల్లో నర్సరీలు పెంచారు. శాఖకు నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. నర్సరీల్లో మొక్కలు పెరిగేసరికి ప్రభుత్వం మారిపోయింది. మూడు రాజధానుల ప్రతిపాదన తెర మీదకొచ్చింది. ఇంకేం.. పెరిగిన మొక్కలను ప్లాస్టిక్ సంచుల్లోనే వదిలేశారు. కొన్ని మొక్కలు చనిపోగా.. కొన్ని మాత్రం సంచుల్లోంచే పెరిగి చెట్లలా మారాయి. కనీసం రైతులకు పంపిణీ చేసినా బాగుండేదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి నర్సరీలకు వెచ్చించిన రూ.15 లక్షలు బూడిదలో పోసినట్లయింది.