గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో మరోసారి ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఆక్రమణల పేరుతో పలు నిర్మాణాలను కూల్చివేసేందుకు అధికారులు ప్రయత్నించడాన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అధికారుల తీరు పట్ల ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో, ప్రస్తుతం గ్రామంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు.
ప్రజలెవరూ గుంపులుగా కనిపించకూడదన్నారు. ఇప్పుడు మళ్లీ కూల్చివేతలు జరుగుతుండడం పట్ల జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ నాదెండ్ల మనోహర్ తీవ్రంగా స్పందించారు. జనసేన పార్టీ ఆవిర్భావ సభ కోసం ఇప్పుడు గ్రామస్తులు భూమి ఇచ్చారన్న కక్షతోనే కూల్చివేతలకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వైసీపీ నేతలకు ప్రజలే బుద్ధి చెబుతారని, ఆ రోజు త్వరలోనే వస్తుందని అన్నారు.