గుంటూరు: సీఆర్డీఏ పరిధిలోని 14 ఎకరాల భూమి వేలానికి ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. నవులూరు సమీపంలోని బైపాస్ వద్ద 10 ఎకరాలు, పిచ్చుకలపాలెం వద్ద 4 ఎకరాలు ఈ-ఆక్షన్ పోర్టల్ ద్వారా వేలం వేయాలని నిర్ణయించింది. గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన అధికారులు ధరను ఖరారు చేశారు. నవులూరు వద్ద ఎకరా రూ.5.94కోట్లు, పిచ్చుకలపాలెం వద్ద ఎకరా రూ.5.41కోట్లుగా నిర్ణయించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వేలానికి ఏర్పాట్లు అధికారులు ప్రకటించారు. సీఆర్డీఏ కంపెనీ భూముల విక్రయంపై రాజధాని ప్రాంత రైతుల ఆగ్రహం వ్యక్తం చేశారు. తుళ్లూరులోని దీక్షా శిబిరంలోమహిళలు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. రాజధాని అంశం కోర్టులో ఉన్నప్పుడు భూములు అమ్మకాలేంటని రైతులు నిలదీస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కోర్టు ధిక్కరణ కిందికే వస్తుంది.