ఏపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్. అసెంబ్లీ కమిటీ హాల్ నం.1లో ఓట్లను లెక్కిస్తున్నారు. కౌంటింగ్ ఏజెంట్లకు ఈసీ పాస్లు ఇచ్చింది. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ తరపున కౌంటింగ్ ఏజెంట్గా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ నిలబడ్డారు. పయ్యావులతో పాటు పోలింగ్ ఏజెంట్గా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కూడా ఉన్నారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో 100 శాతం పోలింగ్ నమోదైంది. సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీడీపీకి అధికారికంగా ఉన్న బలం 23 మంది, వైసీపీ బలం 151, జనసేనకు ఒక ఎమ్మెల్యేతో కలిపి మొత్తం 175 ఓట్లు పోలయ్యాయి. అధికార వైసీసీ నుంచి ఏడుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ప్రదానం ప్రతిపక్షమైన టీడీపీ అనూహ్యంగా విజయవాడ మాజీ మేయర్ పంచుమర్తి అనూరాధను పోటీలో నిలిపింది.
ఈరోజు ఉదయం వెలగపూడిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మొదటి అంతస్థులో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ మొదలైంది. ముందుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో ఓటింగ్ ప్రక్రియ. తరువాత ఉప ముఖ్యమంత్రి (ఆబ్కారీ) నారాయణస్వామి , రాష్ట్ర మంత్రులు గుడివాడ అమర్నాథ్ , ఉషశ్రీ చరణ్ , దాడిశెట్టి రాజా ), ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు , మేకతోటి సుచరిత తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్ర మంత్రులు ధర్మాన ప్రసాదరావు, మంత్రి పాముల పుష్ప శ్రీవాణి, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, కొలుసు పార్థసారథి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
టీడీపీ ఒక స్థానానికి మాత్రమే పోటీచేస్తోంది. ఆ పార్టీకి 23 స్థానాలు సాంకేతికంగా కనిపిస్తున్నాయి.. ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ (గన్నవరం), కరణం బలరాం (చీరాల), మద్దాళి గిరి (గుంటూరు పశ్చిమ), వాసుపల్లి గణేశ్‌కుమార్ (విశాఖ దక్షిణం) వైసీపీలోకి ఫిరాయించారు. దీంతో టీడీపీకి 19 సీట్లు మాత్రమే ఇప్పుడు ఉన్నాయి. టీడీపీ పోటీ చేసే అవకాశం లేదని, ఈ ఏడును ఏకగ్రీవంగా గెలుచుకుంటామని వైసీపీ నాయకత్వం మొదట భావించింది. కానీ ప్రతిపక్షం అనూహ్యంగా విజయవాడ మాజీ మేయర్ పంచుమర్తి అనురాధను పోటీలో నిలిపింది. వైసీపీ నుంచి మరొక్క ఎమ్మెల్యే ఓటు వేస్తే ఆ పార్టీ అభ్యర్థి గెలుపొందే అవకాశం ఉంది. అదే జరిగితే వైసీపీ నిలబెట్టిన ఏడుగురు అభ్యర్థుల్లో ఒకరు ఓడిపోతారు. వైసీపీకి బలం లేకపోయినా ఏడో అభ్యర్ధిని పోటీ పెట్టడంపై పార్టీలో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. పార్టీలో రోజురోజుకు పెరుగుతున్న అసంతృప్తితో ఎమ్మెల్యేలు డీవియట్ అయ్యారా? అనే ఆందోళనలో వైసీపీ నేతలున్నారు.