ఏపీ అసెంబ్లీలో రెండు కీలక తీర్మానాలు ఆమోదించారు. దళిత క్రైస్తవులను ఎస్సీల్లో చేర్చాలని, బోయ, వాల్మీకి కులస్తులను చేర్చాలని తీర్మానాలు చేశారు. అసెంబ్లీలో ఆమోదించిన 2 బిల్లులను కేంద్రానికి పంపుతున్నామన్న సీఎం జగన్ కొందరు కావాలనే తప్పుడు ప్రచారం, ఈ తీర్మానాలతో గిరిజనులు, ఆదివాసీలకు ఇబ్బంది ఉండదని అన్నారు.