ఏపీ రాజధాని అమరావతిలోని ఎస్–3 జోన్లో పేదలకు 268 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పేదలందరికీ ఇళ్ల పథకం కింద 268 ఎకరాలు కేటాయించింది. 6–5 జోన్లలో కేటాయించిన 1134 ఎకరాలకు అదనంగా ఈ భూమిని కేటాయించారు. గుంటూరు, ఎన్టీఆర్జిల్లాల్లో లబ్ధిదారుల సంఖ్య మేరకు లేఖ రాసిన కలెక్టర్లు. ఆ లేఖ అదనపు భూమి కేటాయింపునకు సీఆర్డీఏ ప్రతిపాదనలు చేసింది. సీఆర్డీఏ పరిమాణంలో 268 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అనంతవరం, నెక్కల్లు, పిచ్చుకల పాలెం, బోరుపాలెంలో భూమి కేటాయింపు జరిగింది.