దేశంలో అతి పెద్ద స్కామ్ అమరావతి అన్న ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి. దేశ భక్తితో తన ఇంటిని ప్రభుత్వానికి ఇచ్చానని లింగనేని కోర్టులో చెబుతున్నారు. సీఎం పదవి పూర్తయ్యాక చంద్రబాబు ఆ ఇంటిని ఎందుకు ఖాళీ చేయలేదని ప్రశ్నించారు. లింగమనేని రమేష్‌కు రైతుల భూమిని ఇచ్చారని అన్నారు. సుప్రీం కోర్టుకు వెళ్ళి పేదల ఇళ్లను అడ్డుకున్నారని అన్నారు. కరడుగట్టిన దుర్మార్గులు, పెత్తందార్ల పక్షాన టీడీపీ, జనసేన, వామపక్షాలు ఒక్కటయ్యాయని సజ్జల అన్నారు. కుట్రపూరితంగా జగన్ పై దాడి మొదలు పెట్టారని అన్నారు.