టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ చేపట్టిన పాదయాత్రపై ఏపీ మంత్రి రోజా మరోసారి ఫైర్ అయ్యారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రులను చంద్రబాబు పపెట్‌లా ఆడించారన్న మంత్రి.. జగన్ అందరినీ తమ సొంత మనిషిలా చూస్తున్నారు. నలుగురి కోసం మాట్లాడి చప్పట్లు కొట్టుకుంటే ఫలితం లేదు. లోకేశ్ ది యువగళం కాదన్న మంత్రి రోజా.. గంగాళం అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధిపై చర్చకు మేమే రమ్మంటున్నాం వస్తారా.. అని సవాల్ విసిరారు.
భయపడి ప్లేట్ ఫిరాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి ఛాలెంజ్‌కైనా మేము సిద్ధమని మంత్రి రోజా స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల సంఘం కోసం తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్ లోని పీఎల్ఆర్ కన్వెన్షన్ హాల్లో వైసీపీ నేతల కీలక భేటీ జరిగింది. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, ఆర్కే రోజా, పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, ముఖ్య నేతలు.