లోకేషన్ ఆధారంగా స్వాధీనం చేసుకున్న పోలీసులు
ముద్ర, తెలంగాణ బ్యూరో : తిరుమలలో దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా శ్రీవారి ధర్మరథాన్నే దొంగిలించారు. ఆదివారం టీటీడీ ఎలక్ట్రిక్ బస్సును గుర్తు తెలియని దుండగులు దొంగిలించారు. అయితే, లోకేషన్ ఆధారంగా ఎలక్ట్రిక్ ఐన్సీ నాయుడుపేటలో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ బస్సును స్వాధీనం చేసుకుని దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నట్టు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. తిరుమలలో ఎలక్ట్రిక్ బస్సు చోరికి గురైంది. గుర్తు తెలియని వ్యక్తులు బస్సును దొంగతనం చేశారు. చోరీ చేసిన బస్సును తీసుకెళ్తుండగా లోకేషన్ ఆధారంగా నాయుడుపేట వద్ద పేర్కొన్నారు. దీంతో, బస్సును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కానీ, ఇప్పటికే దుండగులు పారిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగలను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు.