ముద్ర,ఆంధ్రప్రదేశ్:-కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తిరుమల వెళ్లారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో కలియుగదైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి సేవలో ఉంటుంది.
సతీమణితో కలిసి అమిత్ షా గురువారం సాయంత్రం తిరుమల చేరుకున్నారు. ఇక రాత్రి అక్కడే బస చేసి శుక్రవారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో కలియుగదైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి సేవలో ఉంటుంది. ఉదయం ఆలయానికి చేరుకున్న అమిత్ షా దంపతులకు తితిదే అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు. అనంతరం తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి అమిత్ షా దంపతులను శాలువాతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.