- టీటీడీ అదనపు ఈవోగా బాధ్యతలు స్వీకరించిన వెంకయ్య చౌదరి
తిరుపతి, ముద్ర ప్రతినిధి: తిరుమల దేవస్థానం (టీటీడీ) అదనపు ఈవో నియమితులైన వెంకయ్య చౌదరి శనివారంనాడు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీటీడీలో పనిచేసే అవకాశం లభించడం పూర్వజన్మ సుకృతమని అన్నారు.
తనకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యత నిబద్ధతతో నిర్వహించానని,సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు త్వరితగతిన స్వామి వారి దర్శనం కల్పించే విధంగా ఏర్పాట్లు చేశారు వెంకయ్య చౌదరి.ఉద్యోగులందరి అభిప్రాయాలు తీసుకొని ముందుకు వెళ్తామని చెప్పారు.