- ఏసీబీ నోటీసులకు స్పందించిన ఎఫ్ఈవో సీఈవో
- నాలుగు వారాల సమయం కోరిన ఎఫ్ఈవో
ముద్ర, తెలంగాణ బ్యూరో : ఫార్ములా ఈ-రేస్ కేసులో ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే, కేటీఆర్ సహా పలువురిని ప్రశ్నించిన ఏసీబీ..తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫార్ములా ఈ-రేస్ కేసులో ఎఫ్ఈవో కంపెనీకి ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఎఫ్ఈవో కంపెనీకి హెచ్ఎండీఏ నగదు బదిలీ చేసింది. అయితే ఏసీబీ నోటీసులకు స్పందించిన ఎఫ్ఈవో సీఈవో.. నాలుగు వారాల సమయం. ఏసీబీ దర్యాప్తు చేస్తున్న ఫార్ములా ఈ-రేస్ కేసులో ఈ నోటీసులు ఇచ్చారు. ఏసీబీ డిసెంబర్ 19న ఫార్ములా ఈ రేస్ కు సంబంధించిన కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముగ్గురిని నిందితులుగా చేర్చారు. ఏ1గా మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, ఏ2 జీఏఏఎస్ అరవింద్ కుమార్, ఏ3గా హెచ్ఎండీఏ అధికారి బిఎల్ ఎన్ రెడ్డిలను నిందితులుగా చేర్చారు. కానీ ఈ కేసులో నిధులు వెళ్లిన ఎఫ్ఈవో సంస్థను నిందితుల జాబితాలో చేర్చలేదని గతంలో అనేక సార్లు బీఆర్ఎస్ న్యాయవాదులు కోర్టులో వాదించారు. వారితో పాటు మాజీ అనేక సందర్భాల్లో ప్రెస్ మీట్ నిర్వహించిన తరుణంలో ఇదే మంత్రి కేటీఆర్ కూడా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎఫ్ఈవోకు ఈసీబీ అధికారులు నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. అయితే ఎఫ్ఈవో ను నిందితుల జాబితాలో చేరుస్తారా లేదా సాక్షిగా పరిగణిస్తారా అనే విషయం ఆసక్తిగా మారింది. నిబంధనల ప్రకారం రేస్ నిర్వహించేందుకు చెల్లించాల్సిన డబ్బులను అగ్రిమెంట్‌కు విరుద్ధంగా హెచ్ఎండీఏ చెల్లించిన విషయం తెలిసిందే. అయితే అగ్రిమెంట్ లేకపోయినా చెల్లింపులు ఎవరు చేసిన నిధులు సంస్థ చేరింది మాత్రం ఎఫ్ఈవోకే. దీంతో ఈ సంస్థను సాక్షిగా పరిగణిస్తారా లేదా నిందితుల జాబితాలో చేరుస్తారా అన్నదీ ఆసక్తికరంగా మారింది.
మరోవైపు ఈ కేసులో మరికొంతమంది సాక్షులను ఏసీబీ విచారిస్తోంది. హెచ్ఎండీఏలోని అధికారుల నుండి ఏసీబీ స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. వీరితో పాటు గతంలో ఫార్ములా ఈ-రేస్ నిర్వహణ కోసం అప్పటి ప్రభుత్వం రెండు కమిటీలను కూడా నియమించింది. ఎగ్జిక్యూటివ్ కమిటీతో పాటు మేనేజింగ్ కమిటీని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నియమిస్తూ జీవోను సైతం జారీ చేసింది. ఆ కమిటీలో ఉన్న సభ్యుల స్టేట్మెంట్లను ఇప్పటికే ఏసీబీ రికార్డు చేసింది. వారు సమాచారం ఆధారంగా త్వరలోనే కేటీఆర్‌తోపాటు అరవింద్ కుమార్ కు మరో దఫా నోటీసు ఇచ్చేందుకు ఏసీబీ సిద్ధమైంది.
ఇక తాజాగా ఎఫ్ఈవో సంస్థకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత సీజన్ 10 నిర్వహణ కోసం సీఎం రేవంత్ రెడ్డిని 2023 డిసెంబర్ లోనే ఎఫ్ఈవో సంస్థ సీఈవో ఆల్బర్టో కలిశారు. జనవరి 16న ఆయనకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. అయితే ఏసీబీ ఇచ్చిన నోటీస్‌కు జనవరి 25న ఆయన రిప్లై ఇచ్చారు. ఏసీబీకి హాజరుయ్యేందుకు మీకు నాలుగు వారాల సమయం కావాలని. ఇంకా ఏసీబీ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
The post ఫార్ములా కేసులో మళ్లీ నోటీసులు … ఎఫ్ఈవో కంపెనీకి ఏసీబీ నోటీసులు appeared first on Mudra News.