వచ్చే ఎన్నికల్లో విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి పోటీలో ఉంటా. నా ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా ఉన్న పార్టీ నుంచే పోటీ చేస్తాను. నా ఆశయాలకు సరిపోకపోతే స్వతంత్రంగా అయినా బరిలో నిలుస్తా. ఏ పార్టీ నుంచి పోటీ చేయాలనే విషయంపై ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు” అని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా సహా విభజన చట్టంలోని హామీలన్నీ నెరవేర్చాలని, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలని, విశాఖకు రైల్వేజోన్ కోసం డిమాండ్ చేశారు.
విజయవాడలో నిర్వహించిన ఏపీ, తెలంగాణ బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్ఠ పరిచే సత్తా బ్యాంకర్లకే ప్రదర్శన.