పులివెందుల: తన తండ్రి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు హత్య చేశారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని ఆయన కుమార్తె సునీతారెడ్డి అన్నారు. ఈ కేసులో నిజాలు కచ్చితంగా బయటకు రావాలని చెప్పారు. వివేకా వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ జిల్లా పులివెందులలోని ఆయన ఘాట్‌లో నివాళులర్పించిన అనంతరం సునీత మీడియాతో మాట్లాడారు. ”కొందరు వ్యక్తులు దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేస్తున్నారు. నాకు తెలిసిన విషయాలన్నీ సీబీఐకి డాక్యుమెంట్ల రూపంలో సమర్పించా. కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేస్తున్నానని నాకు కూడా తెలుసు. హత్య కేసులో ప్రేయసి ఉందని నమ్ముతున్నందునే వారిపై సీబీఐకి అన్ని విషయాలు చెబుతున్నా. నాన్న హత్యపై గతంలో కొందరు తేలిగ్గా మాట్లాడారు. కడప, కర్నూలు వంటి ప్రాంతాల్లో ఇలాంటివి మామూలే కదమ్మా అన్నారు. నాన్నను ఎవరు హత్య చేశారో తెలుసుకోకుండా ఎలా వదిలిపెట్టగలను?” అని సునీత ఉంది.