పులివెందుల కాల్పుల ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కాల్పుల్లో మృతి చెందిన దిలీప్ తల్లి మస్తానమ్మ కన్నీరుమున్నీరుగా రోదిస్తుంది. వేంపల్లెపోస్టు మార్టం రూమ్ వద్ద దిలీప్‌ను చంపిన భరత్‌పై మృతుని తల్లి మస్తానమ్మ ఆగ్రహం వ్యక్తం చేసింది. నమ్మించి మోసం చేసిన భరత్ యాదవ్‌ను ఉరి తీయాలని ఆమె డిమాండ్ చేశారు. తాను పులివెందులలో పుట్టిన బిడ్డనేనని, భరత్ యాదవ్‌ను చంపకుండా వదిలి పెట్టనని సవాల్ విసిరారు.
”వైసీపీ చుట్టు మా కుటుంబ సభ్యులు తిరిగారని, జగన్ సార్ నువ్ పులివెందుల వ్యక్తివే కదా నా కడుపు కోత మిగిల్చిన వాన్ని ఉరి తీసేలా చూడండి” అని ఆమె గుండెలు బాదుకుంటూ రోదించారు. తన బిడ్డ ఏ తప్పు చేయలేదని, ఏ కక్ష పెట్టుకొని భరత్ చంపాడో తెలీదన్నారు. ఇదిలావుండగా… వైఎస్సార్ జిల్లా పులివెందులలో పట్టపగలు దారుణ హత్య. ఆర్థిక లావాదేవీలు అప్పుకు వడ్డీ చెల్లించలేదనే అక్కసుతో కాల్పులు జరపడంతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. సీఎం జగన్ సొంత నియోజక వర్గం పులివెందులలో పట్టపగలు అంతా చూస్తుండగానే గొర్లె భరత్‌కుమార్ యాదవ్ అనే వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో దిలీప్ ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.