వైఎస్ వివేకా రెండో భార్య షమీమ్ స్టేట్ మెంట్ కాపీలో కీలకాంశాలు ఉన్నాయి. వివేకాతో 2010లో ఆమెకు పెళ్ళయింది. 2011లో మరోసారి పెళ్లి చేసుకున్నారు. 2015లో కొడుకు హెహన్షా పుట్టాడు. హత్యకు కొన్ని గంటల ముందు వివేకా షమీతో ఫోన్‌లో మాట్లాడాడు. మా వివాహం వివేకా కుటుంబ సభ్యులకు ఇష్టం లేదని షమీ చెప్పింది. శివప్రకాశ్ రెడ్డి తనను చాలాసార్లు బెదిరించాడని చెప్పింది. ఆమె కుటుంబ సభ్యులను కూడా శివప్రకాశ్ రెడ్డి బెదిరించాడు. వివేకాకు దూరంగా ఉండాలని సునీతా రెడ్డి కూడా బెదిరించేది.
వివేకా ఆస్తిపై సునీత భర్త రాజశేఖర్‌కు కాంక్ష ఉండేది. కొడుకు హెహన్‌షా పేరుతో నాలుగు ఎకరాలు కొనాలని వివేకా అనుకున్నారు. వివేకాను సొంత కుటుంబ సభ్యులే దూరం పెట్టారు. అన్యాయంగా ఆయన చెక్ పవర్ తొలగించారు. చెక్ పవర్ తొలగించడంతో వివేకా ఆర్థిక ఇబ్బందులు పడ్డారు. బెంగళూరు ల్యాండ్ సెటిల్మెంట్తో రూ.8 కోట్లు వస్తాయని వివేకా అన్నారు. హత్యకు కొన్ని గంటల ముందు కూడా రూ.8 కోట్ల గురించి వివేకా మాట్లాడారని షమీ చెప్పింది.