హైదరాబాద్: కోవిడ్-19 దాడి చేసి ఐదేళ్లు గడిచాయో లేదో.. మరో కొత్త వైరస్ ఆందోళన మొదలైంది.. చైనాలో విజృంభిస్తున్న హెచ్‌ఎంపీవీ ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతోంది.
మన దేశం లోనే మొదటి ఐదు కేసులు బయట పడినట్టు వస్తున్న వార్తలు అందరినీ భయాందోళనలకు గురి చేస్తున్నాయి. కోవిడ్-19 అనుభవాలు అంతగా వెంటాడుతున్నాయి మరి. కానీ, హెచ్‌ఎంపీవీ కొత్తదీ కాదు, ప్రమాదకరమైందీ కాదు.. కాకపోతే, ఐదేళ్ల లోపు పిల్లలు, 65 ఏళ్లు పైబడ్డ వృద్ధుల్లో కొందరికి మాత్రం తీవ్ర చిక్కులు తెచ్చి పెట్టొచ్చు. తగు జాగ్రత్తలు పాటిస్తే అసలు దీని బారిన పడకుండానూ కాపాడుకోవచ్చు..
• జలుబు లక్షణాలు కనిపిస్తే విడిగా ఉండాలి. ఇతరులకు దూరం పాటించాలి. 65 ఏళ్లు పైబడ్డ వారు, మధుమేహం వంటి ఇతరత్రా సమస్యలు గల వారు వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.
• ముక్కు, నోరు పూర్తిగా కప్పి ఉండేలా మాస్కు ధరించాలి. దగ్గు, తుమ్ములతో బాధ పడే పిల్లలను బడికి పంపించొద్దు..
• బయటి నుంచి ఇంట్లోకి రాగానే కనీసం 20 సెకండ్ల పాటు సబ్బు, నీటితో చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాతే ఇంట్లో వస్తువులను తాకాలి..
• దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు రుమాలు, టిష్యూ పేపర్ అడ్డు పెట్టుకోవాలి..
• కరచాలనాలు చేయొద్దు..
• అనవసరంగా ముక్కు, కళ్లు, నోటిని చేత్తో తాకొద్దు..
The post హెచ్‌ఎంపీవీ (హెచ్‌ఎంపీవీ) కొత్తదేమీ కాదు.. జాగ్రత్తలు పాటిస్తే చాలు.. appeared first on Mudra News.