నెల్లూరు: నా ఫోన్ ట్యాపింగ్ అవుతుందని ఒక సినీయర్ ఐపిఎస్ అధికారి దృవీకరించారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఈ వ్యవహారంపై కేంద్రానికి పిర్యాదు చేస్తానని అయన ఏర్పాటు. బుధవారం అయన మీడియాతో మాట్లాడారు. ఈ ట్యాపింగ్ వ్యవహారం ఎమ్మెల్యేలతో ఆగదు. భవిష్యతులో ఐఏఎస్ లు, ఐపీఎస్ లు, న్యాయమూర్తుల మీద కూడా చేస్తారు. హైకోర్టు చీఫ్ ఫోన్ ను కూడా ట్యాపింగ్ చేస్తారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైకాపా నుంచి పోటీ చేయలేదనిఅయన కుండబద్దలు కొట్టారు. అనుమానం ఉన్నచోట ఉండాలని నాకు లేదు. నా రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో వైకాపా నుంచి పోటీ చేయడం లేదు. ఆ పార్టీ నుంచి పోటీకి నా మనసు అంగీకరించడం లేదు. నన్ను సంజాయిషీ అడగకుండానే నాపై చర్యలు చేపట్టారని.
నిన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఫోన్ ట్యాపింగ్ జరగలేదని చెప్పారు. పార్టీ నుంచి వెళ్లేవాళ్లు వెళ్లొచ్చని ఆయన అన్నారు. బాలినేని మాటలను సీఎం మాటలుగా చూడాలని అన్నారు. భవిష్యత్తు కార్యాచరణ ఏంటనేది త్వరలోనే అని అయన అన్నారు.