OverdriveNTool is a software application https://bittention.com/programs/overdriventool/ designed for AMD Radeon GPUs. It lets users tweak core clock speed, memory frequency, voltage settings, fan speeds, and power constraints on their graphics cards.

Advanced programs designed to fine-tune the GPU encourage all users of the computers to pick and use one of the most suitable programs. MorePowerTool https://getpc.top/programs/morepowertool/ is renowned for its extraordinary features to increase the frequency of the processor, reduce power consumption, and perform other important actions.

Микрокредит с плохой кредитной историей в Казахстане https://mikrokredity-online.kz/loans/mikrokredit-s-plohoj-kreditnoj-istoriej— это возможность для людей с негативным кредитным прошлым получить небольшую сумму денег в долг. Многие микрофинансовые организации (МФО) в стране готовы рассмотреть заявки от клиентов с испорченной кредитной историей, так как они в первую очередь ориентируются на текущую платежеспособность заемщика.

Home ఆంధ్రప్రదేశ్ రైలు దహనం కేసు నుంచి విముక్తి ఎప్పుడు? – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Swen Daily

రైలు దహనం కేసు నుంచి విముక్తి ఎప్పుడు? – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Swen Daily

by Admin_swen
0 comments
 రైలు దహనం కేసు నుంచి విముక్తి ఎప్పుడు?  - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రధాన డిమాండ్‌తో కాకినాడ జిల్లా తునిలో నిర్వహించిన కాపు గర్జన సభ సందర్భంగా చెలరేగిన అల్లర్లకు సంబంధించి కాపు నేతలపై కేసులు వెంటాడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 80 శాతం కేసులు కొట్టేసినా రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు దహనం కేసులు నీడలా వెంటాడుతున్నాయి. కాపు రిజర్వేషన్‌ పోరాట ఉద్యమంలో తుని రైల్వే స్టేషన్‌ వద్ద రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ను దహనం చేసిన సంఘటనకు సంబంధించి 41 మంది నిందితులపై విచారణ కొనసాగుతోంది. విజయవాడ రైల్వే కోర్టుకు ప్రతీ వారం ఈకేసులో నిందితులు హాజరవుతున్నారు. అయితే ఇప్పటివరకు 18 మంది పోలీసు అధికారుల సాక్ష్యాలను విన్న కోర్టు ఇక ఆనాటి రైలులో ఉన్న ప్యాసెంజర్ల సాక్షాలు వినాల్సి ఉంది.

రైలులో ప్రత్యక్ష సాక్షులుగా చెబుతూ వారిని కోర్టుకు తీసుకువచ్చిన సాక్షాలను చెప్పాల్సి ఉండగా, రైల్వే పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నట్లు చూపిస్తున్నారు. ఈ కేసులో ప్రధానంగా కాపు రిజర్వేషన్ పోరాట సమితి నాయకుడు ముద్రగడ పద్మనాభం రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి దాడి శెట్టి రాజా, వన్‌ టీవీ ఎండీ మంచాల సాయిసుధాకర నాయుడు, సినీ నటుడు జీవీ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు కామన ప్రభాకర రావు, కాపు నాయకులు కల్వకొలనుతాజీ, వాసిరెడ్డి ఏసుదాసు, నల్లా విష్ణుమూర్తి, ఆకుల రామకృష్ణ ఉన్నారు. కాపులను బీసీల్లో చేర్చాలన్న నినాదంతో కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం పిలుపు మేరకు 2016 జనవరి 31న తునిలో నిర్వహించిన బహిరంగ సభలో వేలాది మంది కాపులు జరిగాయి. సభ అనంతరం అక్కడ జరిగిన విధ్వంసంలో అల్లర్లు చెలరేగాయి. ఈ నేపథ్యంలోనే తుని రైల్వే స్టేషన్‌లో ఉన్న రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ను కొందరు దహనం చేశారు.

ఈ సంఘటన పలులో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు దహనం అయ్యాయి. దీంతో అటు రైల్వే శాఖతోపాటు అప్పటి టీడీపీ రాష్ట్ర ప్రభుత్వం 329 కేసులు పలు సెక్షన్ల కింద నమోదు చేసింది. 2016 నుంచి 2019 వరకు దర్యాప్తులో 153 కేసులు వీగిపోయాయి. ఆ తరువాత వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక 176 కేసులుగానూ 161 కేసులను వెనక్కు తీసుకుంది. 14 కేసులపై మాత్రం కోర్టులో విచారణ కొనసాగుతోంది. వైసీపీ ప్రభుత్వం 161 కేసులు ఎత్తివేసినా కేంద్ర ప్రభుత్వం పరిధిలోని రైల్వే శాఖకు సంబంధించిన కేసుల్లో పలు సెక్షన్ల కింద రైల్వే పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులు ఎత్తేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి వీలులేదు. అప్పటి నుంచి విజయవాడ రైల్వే కోర్టు ఈ కేసులను విచారిస్తోంది. తుని రైలు దహనం కేసులకు సంబంధించి నిందితులుగా ఉన్న కాపు ఉద్యమ నాయకులు ప్రతీ వారం విజయవాడ రైల్వే కోర్టుకు హాజరవుతున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పలు సెక్షన్ల కింద నమోదు చేసిన కేసులను ఎత్తివేయగా రైల్వే చట్టం ద్వారా నమోదైన కేసుల విచారణ కొనసాగుతోంది. దీంతో ప్రతీ వారం విజయవాడ రైల్వే కోర్టుకు నిందితులుగా ఉన్న పలువురు కాపు ఉద్యమ నాయకులు హాజరుకావాల్సిన పరిస్థితి ఉంది.

ఆనాడు రైలు దహనం ఘటనలో ప్రతక్ష సాక్షులు, సీసీ కెమెరా పుటేజీలు, విూడియా ద్వారా వీడియోలు సేకరించిన రైల్వే పోలీసులు.. 1989, 1984 రైల్వే యాక్ట్‌ ప్రకారం పలువురిపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులకు సంబందించి ఆ సమయంలో రైలులో ప్రయాణిస్తున్న వారిలో కొందరిని కూడా సాక్షులుగా చేర్చారు. ప్రస్తుతం ఆనాడు డ్యూటీలో ఉన్న అధికారులు, పోలీసుల సాక్షాలను విన్న కోర్టు త్వరలోనే ప్రత్యక్ష సాక్షులు అయిన ప్రయాణికుల సాక్షాలు వినాల్సి ఉంది. అయితే వారిని కోర్టుకు తీసుకురావడంపైనే రైల్వేశాఖ పోలీసులు మల్లగుల్లాలు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏది ఏమైనా ఏమైనా రైలు దహనం సంఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న కేసులను దాదాపు ఎత్తివేసేందుకు రైల్వే శాఖ ద్వారా నమోదైన కేసులు ఆనాడు ఉద్యమం ముందుండి నడిపించిన కాపు ఉద్యమ నేతలను నీడలా వెంటాడుతున్నాయి.

You may also like

Leave a Comment

Swendaily.com delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech