విజయవాడ,జనవరి 16: ఏపీ మెడికల్ వైద్యుడికి అరుదైన గౌరవం దక్కింది. గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా మోదీ నుంచి ఆహ్వానం అందుకుంది. ఈ మేరకు కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ మెయిల్ ద్వారా ఆమెకు తెలియజేశారు. జనవరి 26న న్యూఢిల్లీలోని ప్రధానితో కలిసి ఆర్‌డే పరేడ్‌ను వీక్షించేందుకు దేశవ్యాప్తంగా 50 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆహ్వానం పలికింది. ఈ విజయవాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (జీజీహెచ్)లో సీనియర్ రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ బాణావతు తేజస్వి (27)కి కూడా ఎంపికైంది. .
2013 ఎంసెట్‌లో మెరిట్ సాధించిన తేజస్వి విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. తేజస్వి కనబరచిన ప్రతిభకు డాక్టర్ వైఎస్‌ఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఆమెకు ఆరు గోల్డ్ మెడల్‌లు అందించారు. అనంతరం ఎయిమ్స్ జోధ్‌పూర్ జనరల్ మెడిసిన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. పీజీలో కూడా గోల్డ్ మెడల్ అందుకుంది. తేజస్వికి ఒక అక్క, చెల్లెలు ఉన్నారు. ఆమె తండ్రి వెంకటేశ్వరరావు విజయవాడలోని వాణిజ్య పన్నుల శాఖలో డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. తమ కూతురికి దక్కిన అరుదైన గౌరవం చూసి ఆమె తల్లిదండ్రులు పొంగిపోయారు. డాక్టర్ తేజస్వీ విూడియాతో మాట్లాడుతూ.. ‘ఇలాంటి అరుదైన ఆహ్వానం అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. నా తల్లిదండ్రులు, కుటుంబం అందించిన సహకారం మరవలేనిదంటూ’ సంతోషం వ్యక్తం చేశారు.