తూర్పు నియోజకవర్గ వైకాపా ఇంచార్జ్ దేవినేని అవినాష్ విూడియాతో మాట్లాడారు. నారా లోకేష్ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో ఆయనకు తెలుసా. పాదయాత్ర చేసేది ప్రజలను మోసం చేయటానికా,టీడీపీ అధికారంలోకి రావటానికా,నువ్వు ఈసారైనా ఎం.ఎల్.ఏ గా గెలవటానికా అనే విషయం స్పష్టంగా చెప్పాలి. అబద్ధాలు,అసత్యాలు ప్రచారం చేసి అధికారంలోకి రావాలనే కుట్రతో పాదయాత్ర చేస్తున్నారు.
టీడీపీ ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు యువత,విద్యార్థులు కోసం ఏం చేశారో చెప్పాలి. మ్యానిఫెస్టోలో అంశాలు కూడా నెరవేర్చలేకపోయాయి. డాడ్‌షిప్‌లు,నిరుద్యోగ భృతి అని డబ్బా కొట్టుకొని అవి కూడా సక్రమంగా అమలు చేయలేకపోయాయి. జన్మభూమి కమిటీల పేరుతో దోచుకున్నారు. సంక్షేమ పథకాలు అందాలంటే వారికి కమీషన్లు ఇవ్వాలి,వారు పెట్టిన శరతులు పాఠించాల్సిన పరిస్థితి ఉండేది. టీడీపీ హయాంలో చేసిందే నిజమైన సైకో పాలన అని నారా లోకేష్ గ్రహించాలి. లోకేష్ ప్రభుత్వాన్ని అడుగుతున్న ప్రశ్నలకు ప్రజలే సమాధానం చెబుతారు. 2లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత జగన్ సొంతం. నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్న బిల్డప్ చూస్తుంటే ఇతనే రాష్ట్రంలో తొలిసారి పాదయాత్రగా ప్రచారం చేస్తున్నారు. పాదయాత్ర ప్రజల కష్టాలు,వారి సమస్యలు తీర్చే విధంగా ఉండాలి.
జగన్ ప్రజల సమస్యలు తెలుసుకొని అధికారంలోకి వచ్చాడు కాబట్టే దేశంలో ఏ పాదయాత్రకు రాణించాలో గుర్తింపు వచ్చింది. పాదయాత్ర లకు బ్రాండ్ అంబాసిడర్ కుటుంబం వై.యస్.కుటంబానిదే అని గుర్తుచేసుకోవాలి. లోకేష్ తన అనుకూల విూడియాలో వచ్చిందో నిజమనుకున్న భ్రమలో ఉన్నాడు,,పాదయాత్రలో ప్రజలు కలిస్తే వాస్తవాలు తెలుసుకొని తోక ముడవటం ఖాయం. లోకేష్ పాదయాత్ర లో నాడు నేడు స్కూల్స్,,జగనన్న కాలనీలు,, అనేక ప్రాంతాల్లోజరిగిన అభివృద్ధి పనులు ఆయనకు ఇదొక అవకాశం. లోకేష్ పాదయాత్ర చేస్తే అమాయకపు ప్రజల ప్రాణాలు ఎక్కడో పోతాయో అని భయమేస్తోంది,ఎన్ని కుటుంబాలు రోడ్డున పడతాయో, ఎంతమంది పిల్లలు తమ తల్లిదండ్రులు ని కోల్పోతారో అని భయమేస్తోంది.
లోకేష్ ప్రసంగాలు కి,ఆయన అనుకుల విూడియా ప్రచారాలకు తమ పార్టీ కార్యకర్త కూడా భయపడరు. యువగళం పేరు కూడా పార్టీలోని చిన్న స్థాయి వ్యక్తి నుంచి బలవంతంగా లాక్కొన్నారు. జగన్ పాదయాత్ర తో లోకేష్ పాదయాత్ర ని పోల్చటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. జగన్ ని సింగిల్‌గా ఎదుర్కొనే దమ్ములేక గుంపులు గుంపులుగా వస్తున్నారు. 175 నియోజకవర్గాల్లో ఎవరినైనా ఎదుర్కొనే దమ్ము జగన్‌కి ఉంది. ప్రజల ఆశీర్వాదాలు జగన్‌కు ఉన్నాయని అన్నారు