ఉడ్తా వైజాగ్..! ప్రశాంతతకు మారుపేరైన విశాఖ నగరం.. మత్తుకు కేరాఫ్ అవుతోందా.. మత్తుమాఫియా చేతుల్లో వెళ్లిపోతోందా?? నార్కోటిక్స్ డ్రగ్స్, ఇంజక్షన్లు` టాబ్లెట్ల వినియోగం ఆ రేంజ్లో ఉంది. 252 కేసుల్లో 598 మంది అరెస్టయితే.. ఈ ఏడాది అంతకుమించి అన్నట్టుంది సిట్యువేషన్. 10 రోజుల గ్యాప్‌లో మూడు చోట్ల మత్తు ఇంజక్షన్లు పట్టుపడ్డాయ్. విద్యార్థులే టార్గెట్‌గా తెగబడుతున్నారు మత్తుముఠాలు. ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ నుంచి దిగుమతవుతున్న మత్తు యువతులు, డ్రగ్స్ ఇక్కడి నుంచి చిత్తు చేస్తున్నారు. మొన్న యాదవ జగ్గరాజుపేటలో మత్తు ముఠా ఆట కట్టించింది ూఇః.తాజాగా జలారిపేటలో 495 మత్తు ఇంజక్షన్లు దొరికాయి.
చిత్తు కాగితాలు, చెత్త వ్యాపారం సాగిన దువ్వాడ రైల్వే స్టేషన్, తుంగ్లంకు వెళ్లే ప్రధాన రహదారిలో జరిగిన మత్తు దందాను మర్చిపోకముందే.. ఓపెన్‌లో ఇలా నడిరోడ్డుపైనే మత్తు ఇంజక్షన్లు అమ్ముడవడం షాకిస్తోంది. జంక్షన్ దగ్గర రెడ్ హ్యాండెడ్‌గా 94 మత్తు ఇంజక్షన్లు ూఇః అధికారులకు దొరికాయి. విజయనగరం జిల్లా దేశపాత్రునిపాలెంకు చెందిన చందు, పెందుర్తికి చెందిన కళ్యాణ్ సాయి, భీమిలికి చెందిన రాఘవరావు అరెస్టయ్యారు. ఇప్పుడు జాలారిపేటలో అమ్మకానికి సిద్ధంగా ఉంచిన 490 పెంటా జోసైన్ లాక్టేట్ ఇంజక్షన్లను సీజ్ చేశారు. కీలక నిందితుడు పూర్ణ మార్కెట్ మహేష్ పోలీసుల అదుపులో ఉన్నాడు. ఇలా మూడు ఇంజక్షన్లు, ఆరు సిరంజిలుగా సాగిపోతోంది.
మత్తు దందా.ఈ సందర్భంగా విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ మాట్లాడుతూ, వెస్ట్ బెంగాల్లో ఒక్కో ఇంజక్షన్ ధర 30 రూపాయలు. అక్కడ కొనుగోలు చేసి విశాఖలో విద్యార్థులకు 300 రూపాయలకు అమ్ముకుంటున్నారు. ప్రత్యేకంగా కొన్ని వాట్సాప్ గ్రూపులు, కోడ్ లాంగ్వేజ్ కూడా ఉన్నాయంటూ ఆయన చెప్పారు.’ఒకవైపు మత్తు ఇంజక్షన్ల కలకలం రేగితే.. గంటల వ్యవధిలోనే వన్‌టౌన్‌లో నల్ల మందు పోలీసులను పరుగులు పెట్టించింది.
కంచర వీధిలో టాస్క్ ఫోర్స్ తనిఖీల్లో కిలో నల్లమందును సీజ్ చేశారు. ఈ నల్లమందు ఒరిజినల్ కేరాఫ్ చత్తీస్ఘడ్. అక్కడినుంచి దిగుమతై కిలో నాలుగు లక్షలకు హైదరాబాద్‌లో అమ్మేలా ప్లాన్ జరిగింది’ జగ్గరాజుపేట గ్రామస్తులు తెలిపారు.మరోవైపు డాక్టర్ పివి సుధాకర్ మాట్లాడుతూ.. మత్తు జోలికి వెళ్లకుండా యువతను ఆదుకునే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మత్తుకి బానిసైన యువత నేరగాళ్లుగా కూడా మారి ఇళ్లల్లో దాడులు చేసే పరిస్థితి వస్తుదని నిపుణులు చేస్తున్న హెచ్చరికలను గుర్తు చేశారు డ్రగ్స్ కేసుల్లో.. మూలాలపై కూపీ తాగుతున్నారు విశాఖ పోలీసులు. అంతరాష్ట్ర పోలీసుల కోఆపరేషన్‌తో డ్రగ్స్ మాఫియాపై యుద్ధం ప్రకటించామంటున్నారు. మరి.. ఈ యుద్ధం ఎంతవరకు విజయవంతం అవుతుంది. ఉడ్తా వైజాగ్ అనే మత్తు మచ్చ నుంచి విశాఖ నగరం ఎప్పటికి బైటపడుతుందో చూడాలి మరి.