,
||తిరుమల తిరుపతి దేవస్థానం||
ఈవార్తలు, తిరుమల: తిరుపతి శ్రీవేంకటేశ్వరస్వామి వారి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఆన్‌లైన్ కోటా టికెట్లను ఈ నెల 13న ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఒక ప్రకటనలో ప్రదర్శించబడింది. శ్రీవారి ఆలయంలో బాలాలయ నిర్మాణం కారణంగా ఈ నెల 22 నుంచి 28 వరకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా టికెట్లను విడుదల చేయలేదు. అయితే, బాలాలయ నిర్మాణాన్ని వాయిదా వేసిన నేపథ్యంలో ఈ రోజుల్లో కోట టికెట్లను సోమవారం విడుదల చేసిన టీటీడీ అధికారులు. అటు.. మార్చి నెల అంగ ప్రదక్షిణ టోకెన్ల కోట, 23 నుంచి 28 వరకు విడుదల చేయని కోటా టికెట్లను శనివారం (ఫిబ్రవరి 11వ తేదీ) ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేసింది.