ముద్రణ ప్రతినిధి, ఖమ్మం: తాజాగా బిఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటూ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేసిన మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి శుక్రవారం అనూహ్యంగా తాడేపల్లిలో ఏపీ ముఖ్యమంత్రి క్యాంప్ ప్రత్యక్షం అయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సమావేశం అయ్యారు.
వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. వైఎస్ కుటుంబం, వైఎస్ జగన్ తో ఉన్న వ్యక్తిగత అనుబంధంతోనే ఆయనను కలిశారని పొంగులేటి అనుచరులు తెలిపారు