ప్రకృతి పరిరక్షణ, సంప్రదాయ వృత్తులకు చేయూత తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు చేపట్టారు. అందులో భాగంగా తాటాకు బుట్ట లడ్డూ విక్రయ కేంద్రాల్లో భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచన చేస్తుంది.
ప్రకృతి వ్యవసాయవేత్త విజయరామ్ సహకారంతో ఈ బుట్టలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతోంది టీటీడీ. త్వరలో ఈ బుట్టలను తక్కువ ధరకు కావలసిన ఏర్పాట్లు చేస్తున్నారు.