శ్రీకాకుళం: ఏప్రిల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు ఉద్యోగ సంఘాలు సమాయత్తమవుతున్నాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ అన్నారు. ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాల విషయంలో ఆందోళనలకు వెళ్తామని చెప్పారు.
శ్రీకాకుళంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ”ఉద్యోగులకు జీతాలు ప్రభుత్వ అనుగ్రహంతో ఇచ్చేది కాదు.. అది మా హక్కు. ప్రతి నెలా ఒకటో తేదీనే ఉద్యోగుల జీతాలు, పింఛన్లు చెల్లిచేలా చట్టం చేయాలి. ఉద్యోగులకు చెల్లింపుల్లో ప్రభుత్వం ఆలస్యం చేస్తోంది. రానున్న శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో చట్టబద్ధత తీసుకురావాలి. ఉద్యోగుల జీపీఎఫ్ సొమ్ము పేపర్లపై తప్ప ఖాతాల్లో లేదు” అని సూర్యనారాయణ అన్నారు.