హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణ మూడోసారి ముగిసింది. దాదాపు 4 గంటలకు ఆయనపై సీబీఐ అధికారులు ప్రశ్నించారు. విచారణ అనంతరం అవినాష్ మీడియాతో మాట్లాడారు. ”మళ్లీ పిలిచినప్పుడు విచారణకు రావాలని సీబీఐ అధికారులు చెప్పారు. విచారణ సందర్భంగా ఆడియో, వీడియో రికార్డింగ్ చేయడం అడిగాం. రెండు, మూడుసార్లు అడిగినా స్పందించి హైకోర్టుకు వెళ్లాం.
సీబీఐ తప్పుదోవ పడుతోందని గతంలోనే చెప్పా. కుట్రలకు ఉపయోగపడే స్టేట్‌మెంట్లు మాత్రమే తీసుకుంటున్నారు. కేసు విచారణ వెనక రాజకీయ కుట్రలున్నాయి. మేం ఎలాంటి తప్పు చేయలేదని కార్యకర్తలకు భరోసా ఇస్తున్నారు. కట్టుకథ అడ్డం పెట్టుకుని విచారణను ముందుకు తీసుకెళ్తున్నారు. సీబీఐ విచారణ కంచె చేను మేసిన చందంగా ఉంది. ఎంతవరకైనా న్యాయపోరాటం కోసం సిద్ధం” అని అవినాష్‌రెడ్డి తెలిపారు.