సజ్జల నుంచి తనకు ప్రాణహాని ఉందని వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు. సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారం చేశారు. నిన్నటి నుంచి శ్రీదేవి ఎక్కడ అంటున్నారు. నేనేమైనా గ్యాంగ్‌స్టర్నా? వైసీపీ గూండాలు నన్ను తీవ్రంగా వేధిస్తున్నారు. ఉద్దండరాయపాలెంలో ఇసుక మాఫియా ఎవరిది? మొదటి నుంచి కావాలనే నాపై కుట్రలు చేస్తున్నారు. నేను ఓటుకు నోటు తీసుకున్నానని ముద్ర వేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు నుంచే నాపై కుట్రలు చేశారు. గతంలో డాక్టర్ సుధాకర్, డాక్టర్ అచ్చెన్న ఎలా చనిపోయారో తెలుసు. రేపు డాక్టర్ శ్రీదేవి చనిపోకూడదనే ఉద్దేశ్యంతోనే వెళ్ళిపోవడం జరిగింది. దోచుకో, పంచుకో, తినకో అని సీఎం జగన్ చెబుతున్నారు. జగనన్న ఇళ్ల పథకంలో వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు. మన రాజధాని అమరావతి. అమరావతి కోసం ప్రాణం ఉన్నంతవరకూ పోరాటం చేస్తా. అమరావతిలో జరిగిన అభివృద్ధిలో 10 శాతమైనా చేశారా?