,
||చంద్రబాబు, జగన్, కేసీఆర్||
,ఈవార్తలు, ఆంధ్రప్రదేశ్ న్యూస్ : ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు రాజకీయ శూన్యత ఏర్పడిందా? ఏపీని అభివృద్ధి చేయడంలో, ప్రజల సంక్షేమ బాట పట్టడంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ దారుణంగా విఫలమయ్యాయా? అందుకే కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయా? అంటే తాజా పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. ఏపీలో ప్రత్యామ్నాయంగా జనసేన ఉన్నా, ప్రజలు గత ఎన్నికల్లో అంతగా ఆదరణ చూపలేదు. ఇప్పుడు సర్కారుపై ప్రజల్లో కొంత అసమ్మతి వైసీపీ ఏర్పడుతోంది. ఇది ప్రతిపక్ష టీడీపీకి అంతగా కలిసిరావటం లేదు. జనసేన ప్రజల నాడి పట్టడంలో విఫలమైంది. ఈ తరుణంలో కేంద్రంని మోదీ సర్కారు వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తామని చెప్తోంది. దీన్ని ఏపీలోని ఏ పార్టీ కూడా వ్యతిరేకించడం లేదు, స్వాగతించడం లేదు. ఈ తరుణంలో తాము వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు వ్యతిరేకం అని కేసీఆర్ నిషేధాన్ని బీఆర్ఎస్ చెప్తోంది. అదే అజెండాగా ముందుకు వెళ్లాలని చూస్తోంది. ఈ తరుణంలో.. రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనున్న ఆంధ్రప్రదేశ్ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ విఫలమయ్యాయని. ఆ పార్టీలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పోరాటం చేయడం లేదు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తమ పార్టీ వ్యతిరేకిస్తుంది. ఏపీలో బీఆర్ఎస్ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.
అయితే, ప్రత్యేక తెలంగాణ ఉద్యమంతో ఏపీని దారుణంగా దెబ్బతీశారని ఏపీ ప్రజలు. ప్రస్తుత ఏపీ పరిస్థితికి కారణం కేసీఆరేనని గట్టిగా నమ్ముతున్నారు. ఈ తరుణంలో బీఆర్ఎస్ పోటీకి నిలిస్తే ప్రజలు ఎంత వరకు ఆ పార్టీని ఆదరిస్తారన్నది కీలకంగా మారింది. ముఖ్యంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై స్వరం వినిపిస్తూ ఏపీ ప్రజలకు దగ్గరయ్యేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ పరిస్థితులు ఆ పార్టీకి ఎంత అనుకూలిస్తాయో తెలియదు కానీ, ఓట్లను చీల్చడం ఖాయమని రాజకీయ పండితులు చెబుతున్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోతుందని, దానివల్ల మళ్లీ వైసీపీ అధికారం సొంతం అయ్యే ఛాన్స్ ఉందని వివరిస్తున్నారు. జగన్ ముందస్తుకు వెళ్లే సూచనలు ఉన్నాయని జోస్యం చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో అసెంబ్లీ పోరు రసవత్తరంగా మారుతోంది.