జగనన్న వసతి దీవెన నిధులు విడుదల కానున్నాయి. 9,55,662 మంది విద్యార్థులకు దీనివల్ల ప్రయోజనం కలుగుతుంది. నేడు రూ.912.71 కోట్లు విడుదల చేయనున్న సీఎం జగన్ ఉన్నత విద్య చదువుకునే విద్యార్థులకు ఆర్థిక సాయం. ఒక కుటుంబంలో ఎంతమంది ఉన్నత చదువులు చదువుతున్నా అందరికీ సాయం అందించే పథకం ఇది. ఏటా రెండు విడతల్లో విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి ఆర్థిక సాయం చేరుతుంది. ఐటీఐ చదివే విద్యార్థులకు రూ.10 వేలు ఇస్తారు.