చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులు, రాజకీయ పరిణామాలపై చర్చించారు. చంద్రబాబుతో పవన్ మూడోసారి సమావేశమయ్యారు. ఇటీవలే ఢిల్లీలో బీజేపీ నేతలతో పవన్ సమావేశమయ్యారు. పవన్ ఢిల్లీ టూర్ తరువాత చంద్రబాబును కలవడంతో వారి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. భేటీ తర్వాత చంద్రబాబు, పవన్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.