- నేటితో ముగియనున్న కస్టడీ
- మరింత సమాచారం సేకరిస్తున్న సీఐడీ
- రిమాండ్ గడువు కూడా ముగియడంతో కోర్టు నిర్ణయంపై ఉత్కంఠ
ముద్ర, తెలంగాణ బ్యూరో : స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు రెండో రోజు సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. ఆదివారం రాజమండ్రి సెంట్రల్ జైలులో రెండు రోజుల కస్టడీలో భాగంగా ఉదయం 9.30 నుంచి అధికారులు బాబును ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు తరుఫు లాయర్ల సమక్షంలో సీఐడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఆయన్ను ఇప్పటికే దాదాపుగా 50 ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. ఈ రోజు మరో 50 ప్రశ్నలతో అధికారులు రెడీ అయినట్లు తెలిసింది. ఈ కేసులో ఇప్పటికే సాక్ష్యుల నుంచి సేకరించిన వాంగ్మూలం ఆధారంగా సీఐడీ అధికారులు బాబును ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. ఈ రోజు సాయంత్రం 5గంటలకు చంద్రబాబు కస్టడీ ముగిసింది. కస్టడీ ముగిసిన తర్వాత చంద్రబాబును సీఐడీ పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఈ రోజుతో చంద్రబాబు జ్యుడిషియల్ రిమాండ్ గడువు ముగియనుండడంతో కోర్టు నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ.